Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీని విడగొట్టిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ను విభజించాలి: సోమిరెడ్డి

ఉత్తరప్రదేశ్ ని విడగొట్టిన తరువాతె ఆంధ్రప్రదేశ్ ను విభజించాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదని ఆ పార్టీని హెచ్చరించారు. ఓట్లు, సీట్లతో రాహుల్ ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్ చూస్తోందని, రాజధాని, నదీ జలాలు, రెవెన్యూ విషయాలు చర్చించకుండా ఎలా విడగొడతామని ప్రకటన చేస్తారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ విషయంలో సోనియాగాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

More Telugu News